సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 30 అక్టోబరు 2020 (16:40 IST)

"వాట్స్ అండ్ వోల్ట్స్" కంపెనీలో భాగస్వామిగా హీరో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్‌ను లాంఛ్ చేసింది.
 
వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి.
 
భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.