బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (13:36 IST)

రచయితగా పదును పెడుతున్న అడవి శేష్

Writer advisesh
Writer advisesh
రచయిత, నటుడు, దర్శకుడు అడవి శేష్ నటించిన మేజర్ సినిమా తర్వాత మరో సినిమా రాలేదు. ఆయన నటించిన గూఢచారి పెద్ద హిట్ అయింది. దాని సీక్వెల్ గా రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా లుక్ ను కూడా విడుదల చేశారు. అయితే ఆ సినిమాకు రచయిత కూడా అయిన శేష్ ఈరోజు తన సోషల్ మీడియాలో లుక్స్ పెట్టి పోస్ట్ చేశాడు. దీనిపై చాలామంది చాలాబాగుందనీ, నెక్ట్స్ సినిమా స్టిల్ అన్నా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
 
decoit poser
decoit poser
ఇక జి 2 (గూఢచారి సీక్వెల్)కు రైటింగ్ పనులు పూర్తయినట్లు తెలిసేలా లుక్ వుంది. మరోవైపు గత ఏడాది డెకాయిట్ సినిమా కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకూ తను రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో  కొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లతో మనల్ని ఆకర్షించడానికి సిద్ధమవుతున్నా అంటూ పోస్ట్ చేశాడు. తాజా సమాచారం మేరకు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రాజెక్ట్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.