సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:13 IST)

ఇద్ద‌రి ప్రేమ‌ను విధి ఎలా మార్చింద‌నేదే -దియా- ప్రీ రిలీజ్ లో చిత్ర యూనిట్‌

Diya prerelease
కన్నడలో విజ‌య‌వంత‌మైన "దియా" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అదే పేరుతో అందిస్తున్నారు. ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్, విభ కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్కే నల్లం ,రవి కశ్యప్ అందిస్తున్నారు. దియా" (Life is Full of Surprises).ఖుషి, దీక్షిత్,పృద్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలవు తున్న సందర్భంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  నిర్మాత‌లు చిత్ర యూనిట్ కు శాలువాలతో సత్కరించారు.
 
చిత్ర హీరో దీక్షిత్ మాట్లాడుతూ, 10 రోజుల క్రితం "ముగ్గురు మొనగాళ్ళు" ప్రి రిలీజ్, ఇప్పుడు "దియా" ప్రి రిలీజ్ ఇలా బ్యాక్ టూ బ్యాక్  రెండు సినిమాలు  రావడం చాలా సంతోషంగా ఉంది. గత నాలుగు సంవత్సరాలనుండీ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాము. దర్శక, నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి గొప్ప విజయాన్ని అందించారు వారికి మా ధన్యవాదాలు. కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
 
హీరోయిన్ ఖుషి మాట్లాడుతూ, ఈ  కథ డీఫ్రెంట్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది.  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని విభాగాల్లో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.
 
కో. డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య  ప్రేమని విధి ఎలా మార్చింది అనే కాన్సెప్టు తో  వస్తున్న అందమైన ప్రేమకావ్యం "దియా". ఈ సినిమా కన్నడ కంటే తెలుగు అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది  అన్నారు..
 
గీత ర‌చ‌యిత పూర్ణ చారి మాట్లాడుతూ, మూడు హృదయాల సంఘర్షణను ఒక పాట రూపంలో చేయడం జరిగింది. నిర్మాతలు చాలా బాధ్యతగా తీసుకొని మంచి నటీనటులను సెలెక్ట్ చేసికొని మంచి చిత్రాన్ని తీయడం జరిగింది అన్నారు.
గాయ‌ని నరసింహ మాట్లాడుతూ, ఈ నగరానికి ఏమైంది నుంచి నాలుగు సినిమాల‌కు రాశాను. మొదట ఈ పాటను పెద్ద సింగర్స్ తో పాడించాలను కొన్నారు.కానీ పూర్ణ గారు నాకు ఇన్ఫర్మ్ చేసి ఆర్.కె గారికి రిఫర్ చేయడంతో ఆర్.కె గారు నాతో "నీవే..నా నీ..వేనా చిట్టి లోకమంతా నాదే మారెనా".. పాటను  పాడించారు.  ఇలాంటి మంచి చిత్రం లో పాడే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు