శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (21:19 IST)

నానితో కలిసి ఆ సీన్ చేసేటప్పుడు ఏడుపొచ్చింది... శ్రద్ధా శ్రీనాథ్(Video)

చేసింది రెండు సినిమాలే. అయితే అటు కన్నడ, ఇటు తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది హీరోయిన్ శ్రద్థా శ్రీనాథ్. కన్నడలో యు టర్న్ సినిమాలో నటించిన శ్రద్థ శ్రీనాథ్‌కు తెలుగులో నానితో నటించే అవకాశం వచ్చింది. జెర్సీ సినిమాతో ఒక్క సారిగా తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యువ ప్రేక్షకులు శ్రద్థా శ్రీనాథ్ నటనకు దాసోహమైపోయారు. భాష తెలియకపోయినా ఆమె హావభావాలు అద్భుతంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు తెలుగు ప్రేక్షకులు.
 
నానితో కలిసి నటించిన జెర్సీ సినిమాలో తనకు బాగా నచ్చిన సీన్ ఒకటే ఉందని చెబుతోంది శ్రద్థ. అదే తన కుమారుడు నాని పుట్టినరోజుకు డబ్బులు కావాలని అడిగితే డబ్బులివ్వను. దీంతో బీరువాలో ఉన్న డబ్బును ఎత్తుకుంటాడు నాని. అప్పుడు గట్టిగా అరుస్తాను. డబ్బులు కూడా దొంగిలించేస్తావా అని. ఆ సీన్ నాకు నిజంగా ఏడుపు తెప్పించింది. నానితో కలిసి నటించే ప్రతి సన్నివేశం నాకు చాలా ఇష్టం. అతని నటన అద్భుతం. అతను ఒక మహానటుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.
 
తమిళం, కన్నడలో మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, వరుసగా రెండు సినిమాల్లో చేస్తే రెండు సినిమాలు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది శ్రద్థ. జెర్సీ లాంటి సినిమాలో నన్ను హీరోయిన్‌గా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, దర్సకుడు గౌతమ్ తిన్ననూరికి చాలా మంచి దర్సకుడని కితాబిస్తోందని శ్రద్థ.