సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (09:27 IST)

నా సంపాదన రోజుకు రూ.2 కోట్లు... ఇక నాకెందుకు ప్యాకేజీలు: : పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఒక చిత్రానికి తాను తీసుకునే రెమ్యుునరేషన్‌ ఎంతో బహిర్గతం చేశారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి మచిలీపట్నం వేదికగా జరిగింది. ఇందులో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల కోసం తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ, ప్యాకేజీలు తీసుకున్నారంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు లేదా ప్రచారం చేసే వారిని చెప్పుతో కొట్టాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో తన సంపాదనపై క్లారిటీ ఇచ్చారు. తాను ఒక చిత్రానికి 20 నుంచి 25 రోజుల పాటు పని చేస్తానని, ఆ సమయంలో ఒక్కో రోజుకు రూ.2 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటానని వెల్లడించారు. అంటే ఒక్క చిత్రానికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 
ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న తనకు డబ్బులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇది ఎన్నికల సమయం కావడంతో మనపై పేటీఎం బ్యాచ్ మరింతగా దుష్ప్రచారం చేస్తుందని, అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఏ ఒక్క వార్తను జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.