సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (15:57 IST)

ఎక్కడికెళ్లినా రంగమ్మత్త అంటున్నారట... అనసూయకు ఆనందమేనా?

హాట్ యాంకర్‌గా ఉన్న అనసూయకు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిదట. అప్పుడు అనసూయ మీడియాతో నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చి హీరోయిన్‌ కావడానికి నే

హాట్ యాంకర్‌గా ఉన్న అనసూయకు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిదట. అప్పుడు అనసూయ మీడియాతో నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చి హీరోయిన్‌ కావడానికి  నేనేమి తక్కువకాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే అని గర్వంగా తెలియజేసింది.
 
జబర్దస్త్ వంటి కామెడి షోలో యాంకర్‌గా ఉన్న అనసూయ రంగస్థలం చిత్రంలో నటించడం వల్ల తనకు సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని తెలియజేసింది. అందరూ అనసూయను ఎక్కడ చూసినా రంగమ్మత్త అనే పిలుస్తున్నారని, తన ఆనందానికి కారణం రంగస్థలం సినిమానేని అనసూయ మీడియాతో సంతోషంగా చెప్పింది.