సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:13 IST)

బిగ్ బాస్ 3... 'రౌడీస్' కంట్రోల్లోకి వెళ్లిపోతుందా? ఎలా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విషయంలో నిర్వాహకులు చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ఉన్న స్టార్ అయితే తప్ప షోకి టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశాలు లేకపోవడంతో అందుకు తగిన హీరోను హోస్ట్‌గా ఒప్పించడానికి తెగ ప్రయత్నాలు సాగించేస్తున్నారట.
 
కాగా... మొదటి సీజన్‌ని సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేసి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రావడానికి కారణమైన యంగ్ టైగర్‌ను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ... 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కారణంగా తారక్ నో చెప్పారట. ఇక రెండో సీజన్‌ని హోస్ట్ చేసిన నేచురల్ స్టార్ నానీ మరోసారి తన వల్ల కాదంటూ చేతులెత్తేసినట్లు కూడా ఒక వినికిడి.
 
అయితే... గతంలో తెలుగులో ప్రసారమైన కొన్ని రియాల్టీ షోలను చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ స్టార్లు హోస్ట్ చేసినప్పటికీ... బిగ్ బాస్ లాంటి షోలకు అలాంటి సీనియర్ స్టార్లు సూట్ కారనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారట. 
 
దీనితో తాజా ‘బిగ్ బాస్ 3' విషయంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పేరు తెర పైకి వచ్చింది. అతడిని ఎలాగైనా ఒప్పించాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇంకా ఎలాంటి అంగీకారం తెలుపలేదని ఒక టాక్ వినిపిస్తోంది. అయితే విజయ్ దేవరకొండకు యువతలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుచుకునే ఈ స్టార్‌.. తన ‘రౌడీ' బ్రాండ్ లాంచ్ అయ్యాక రౌడీ అనే పదానికి అర్థాన్నే మార్చేసారు. విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3కి హోస్ట్‌‌గా వచ్చినట్లయితే... రౌడీలుగా పిలవబడే అతడి ఫ్యాన్స్ కంట్రోల్‌లోకి షో వెళుతుందేమో? 
 
ఇప్పటికే గత ‘బిగ్ బాస్ తెలుగు 2' రియాల్టీ షోను కౌశల్ ఆర్మీ పూర్తిగా కంట్రోల్ చేసేసి... వీక్లీ ఎలిమినేషన్లతో పాటు విజేత స్థాయి వరకు ప్రభావితం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ‘బిగ్ బాస్ 3' విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.