గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (16:34 IST)

కొత్త స్నేహితుడైన బ్లేజ్‌ను పరిచయం చేసిన రాంచరణ్

Ramcharan, blaze
Ramcharan, blaze
రామ్‌చరణ్ ఈ రోజు ఉత్తేజకరమైన వార్తలను వెల్లడించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లారు. గుర్రాల పట్ల అతని ప్రేమ ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. చరణ్ కు గుర్రాలంటే ఎంత ఇష్టం తెలియంది కాదు. హైదరాబాద్ రేస్ క్లబ్ లో మెంబెర్. మగధీర షూట్ లో దాని పేరు బాద్షా.  చరన్ ఇంటికి తెచ్చాక సెంటిమెంట్ గా  గుర్రానికి కాజల్ అనేపేరు కూడా పెట్టారు. హార్స్ రేసులో పలుసార్లు పాలుపంచు కున్న చరణ్ రేస్ క్లబ్ కూడా నడుపుతున్నారు. 
 
Ramcharan, blaze
Ramcharan, blaze
ఈరోజు కొత్త స్నేహితుడైన బ్లేజ్‌ను పరిచయం చేశారు  రాంచరణ్. సోషల్ మీడియాలో ఈ విషయాలు తెలియజేసారు. మగధీర,  ఆర్.ఆర్.ఆర్. లో రామ్ చరణ్ గుర్రాలపై ఫైట్స్ మురిపించారు. తాజాగా ఈ బ్లేజ్‌ను శంకర్ సినిమాలో వాడుతున్నారా అనే డౌట్ అభిమానుల్లో కలిగింది. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్ తీసుకున్నారు. త్యరలో తాజా షెడ్యూల్ లో పాల్గొననున్నారు.