శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:51 IST)

ఆర్ఆర్ఆర్‌ బ్రేక్- ఉత్తర అమెరికాలో సలార్ సినిమా కొత్త రికార్డ్

salaar movie still
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా కొత్త రికార్డ్ సాధించాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28నే విడుదల కావాల్సింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో వాయిదా పడింది. 
 
ఉత్తర అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత సలార్ అత్యధిక బిజినెస్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులు రూ.40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు రూ.36 కోట్లకి అమ్ముడుపోయాయి.
 
కాగా, సలార్ శాటిలైట్ (స్టార్ టీవీ), డిజిటల్ (నెట్‌ఫ్లిక్స్ - తెలుగు, తమిళం, కన్నడ భాషలు), ఆడియో రైట్స్ కలిపి ఇప్పటికే రికార్డు స్థాయిలో 350 కోట్లకు అమ్ముడయ్యాయి.