బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:31 IST)

ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు?

shruti haasan
విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఇపుడు దక్షిణాదిలో టాప్ కథానాయికగా రాణిస్తున్నారు. అనేక మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తెలుగు హీరో ప్రభాస్ నటిస్తున్న "సలార్" చిత్రంలో ఆమె ఒక హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనులు జరుపుకుంటుంది. 
 
ఈ నేపథ్యంలో శృతిహాసన్ ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చేప్పుకుంది. ఇప్పటికే మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన ఆమె... మిగిలిన రెండు భాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకునేందుకు హీరోయిన్లు వెనుకాడుతుంటారు. కానీ, శృతి హాసన్ ఏకంగా ఐదు భాషల్లో సొంత గొంతును వినిపించేందుకు ఆమె సిద్ధమయ్యారు. 
 
కాగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన "సలార్" చిత్రం సెప్టెంబరు 28వ తేదీన విడుదలకానుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.