ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (12:41 IST)

రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరిన రజనీకాంత్ జైలర్

Jailer
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్ట్ 10న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ని స్టార్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జైలర్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. జైలర్ కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 302.89 కోట్ల గ్రాస్ దాటింది.
 
1వ రోజు – రూ. 95.78 కోట్లు
2వ రోజు – రూ. 56.24 కోట్లు
3వ రోజు – రూ. 68.51 కోట్లు
4వ రోజు – రూ. 82.36 కోట్లు
మొత్తం – రూ 302.89 కోట్లు
 
దీంతో రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరిన రజనీకాంత్ నాలుగో సినిమాగా జైలర్ నిలిచింది. నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తమన్నా భాటియా, శివరాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, యోగి బాబు, సునీల్, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్ 'టైగర్' ముత్తువేల్ పాండియన్ పాత్రను పోషించాడు.