శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:29 IST)

సినీ కార్మికులకు నటి కాజల్ అగర్వాల్ విరాళం

కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, మరికొంతమంది కలిసి స్థాపించిన సంస్థ కరోనా క్రైసిస్ ఛారిటీస్ మనకోసం. ఈ సంస్థకు అనేక సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. హీరోయిన్లలో మాత్రం ఒక్కరు మినహా ఇతరులెవ్వరికీ ఇవ్వలేదు. 
 
ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించింది. కరోనా కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ సినీ వర్కర్లకు ఆమె రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించుకున్నారు. కాజల్ తన విరాళాన్ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభమైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అందించనున్నారు. 
 
లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు స్థంభించిపోయాయి. చిత్ర ప్రదర్శనలు నిలిచిపోవడమే కాదు, షూటింగులు కూడా ఆగిపోయాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పనిలేక అవస్థలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు అగ్రనటులు భారీ విరాళాలు ప్రకటించారు.