సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (17:12 IST)

కాజల్ అగర్వాల్ అలసిపోవడం ఎప్పుడూ చూడలేదు : రైటర్ శశికిరణ్ తిక్క

Sasikiran Thikka
Sasikiran Thikka
'గూఢచారి', 'మేజర్' చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న నేపథ్యంలో మూవీ హైలైట్స్ తెలిపారు చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క.
 
- నిన్న “సత్యభామ” సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన కథతో ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి “సత్యభామ” కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ప్రాజెక్ట్ బిగిన్ అయ్యింది.
 
- నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. కాను ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.
 
- మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.
 
- కాజల్ గారు వెరీ యాక్టివ్. ఆమె అలసిపోయి ఉండటం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ టైమ్ లో ఆమె ఎనర్జీ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఈ సినిమాలో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. ఈ రోజు ఆడియెన్స్ కు తగినట్లు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ తో ఉండబోతోంది.
 
- దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.
 
- ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సత్యభామ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీన్స్ లో కొన్ని ఛేంజెస్ చేశాం. హీరోయిక్ మూవ్ మెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అయితే అవి కావాలని పెట్టినట్లు కాకుండా సహజంగా కథ జర్నీలో భాగంగా వస్తుంటాయి. కాజల్ అరవై సినిమాల్లో నటించింది. సత్యభామలో కొత్త కాజల్ ను ప్రేక్షకులు చూస్తారు.
 
- “సత్యభామ” మూవీలో కాజల్ గారు కాకుండా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు  కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాకు మంచి పేరొస్తుంది. ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
- మా మూవీ ట్రైలర్ లాంఛ్ లో బాలకృష్ణ గారు పాల్గొన్నారు. రీసెంట్ గా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఆయన మంచి మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉంది. గూఢచారి  2 సినిమాకు వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, శేష్ ముందే అనుకున్నాం. మహేశ్ బాబు గారు మేజర్ సినిమాలో పార్ట్ అయ్యారు. ఆయనకు సత్యభామ సినిమా చూపించాలని అనుకుంటున్నాం.
 
- దర్శకుడిగా నా నెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ చేస్తున్నారనే ప్రశ్న నెక్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మీరు అడగరు అని భావిస్తున్నా. మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను