రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"
డార్లింగ్ ప్రభాస్ నటించి ఇటీవల విడుదలైన "కల్కి 2898 AD" చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు చేరువవుతోంది. విడుదలైన 10వ రోజున, ఈ చిత్రం దాని కలెక్షన్లలో 106 శాతం పెరుగుదలను సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 34.45 కోట్లు రాబట్టింది.
తెలుగు సీమలో రూ.11 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ గడ్డపై రూ.18.5 కోట్లు వసూలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల కంటే బిటౌన్ వాసులను కల్కి బాగా ఆకట్టుకుందనేది స్పష్టం తెలుస్తోంది.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి సినీ ప్రముఖులు నటించిన ఈ చిత్రం 1,000 కోట్ల రూపాయల దిశగా దూసుకుపోతోంది. దీని ఇండియా నికర వసూళ్లు ఇప్పుడు రూ. 466 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.709 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
మార్నింగ్ 3D షోల ఆక్యుపెన్సీ హిందీలో కంటే తెలుగులో ఎక్కువగా ఉంది. ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 32.62 శాతం, 21.79 శాతంగా ఉన్నాయి. రాత్రిపూట 3డి షోలకు సంబంధించి తెలుగు ఆక్యుపెన్సీ 74.77 శాతం ఉండగా, హిందీ 58.80 శాతంగా ఉంది.
కల్కి 2898 AD మొదటి రోజున రూ. 1.25 కోట్లు రాబట్టగలిగింది. కల్కి 2898 AD 10 రోజుల బాక్సాఫీస్ వసూళ్లలో పఠాన్, సాలార్, సాహో, దంగల్, బాహుబలి వంటి అనేక చిత్రాలను అధిగమించింది. దేశంలో మొత్తం రూ.525 కోట్లు రాబట్టిన సన్నీ డియోల్ నటించిన గదర్ 2 తర్వాతి స్థానంలో ఉంది. ప్రస్తుత పనితీరును బట్టి చూస్తే, కల్కి 2898 AD 3-4 రోజుల్లో గదర్ 2ని అధిగమిస్తుందని భావిస్తున్నారు.