శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (15:15 IST)

చిరంజీవి చిన్న అల్లుడు సరసన బికినీ బ్యూటీ...

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో చిత్రంలో నటించనున్నారు. ఈయన నటించిన తొలి చిత్రం 'విజేత' గత యేడాది జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించినప్పటికీ వసూళ్ళపరంగా నిరాశపరిచింది. దీంతో తన రెండో చిత్రంపై కళ్యాణ్ దేవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 
 
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే, పులి వాసు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్ష్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళితో పాటు మరికొంతమంది నటించనున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'తూనీగ' ఫేమ్ రియా చక్రవర్తిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. చాలా మందిని పరిశీలించిన తర్వాత రియా పేరును ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమె బాలీవుడ్‌లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబి వంటి చిత్రాల్లో యూత్‌కు బాగా దగ్గరేంది. ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చనున్నారు.