మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (13:32 IST)

ఉద్ధవ్ ఠాక్రే ఓ చెత్త ఉత్పత్తి : ఆయనలా నేను తాగుబోతును కాదు : కంగనా రనౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు టార్గెట్ చేశారు. తాను సొంత టాలెంట్‌తో పైకి వచ్చానని, వారసత్వంతో అధికారంలోకి రాలేదని మండిపడ్డారు. 
 
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కంగనా రనౌత్‌పై విమర్శలు శారు. 
 
న్యాయం కోసం కన్నీరు కారుస్తున్నవారు ముంబై పోలీసులను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారని కంగనను ఉద్దేశించి అన్నారు. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లా, ఇక్కడ అందరూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.  
 
'మనం మన ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటాం. గంజాయిని కాదన్న విషయం వారికి తెలియదు. గంజాయిని మీ రాష్ట్రంలోనే పండిస్తారు. అదెక్కడో మీకు తెలుసు. కానీ, మా మహారాష్ట్రలో కాదు' అని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వారసత్వం ద్వారా వచ్చిన ఓ చెత్త ఉత్పత్తి అంటూ విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ తనను నమ్మక ద్రోహి అని అన్నారని, ముంబై తనకు షెల్టర్ ఇవ్వకపోతే తనకు తిండి కూడా దొరకదని అన్నారని ఆమె చెప్పింది. 
 
తనకు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు వయసుంటుందని, కానీ, తాను సొంత టాలెంట్‌తో ఎదిగిన ఒంటరి మహిళనని, తన గురించి ఉద్ధవ్ థాకరే మాట్లాడిన తీరు చూస్తోంటే సిగ్గు వేస్తోందని చెప్పింది. ఉద్ధవ్ ఠాక్రేలా తాను తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదని చెప్పింది. 
 
తాను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్నని చెప్పారు. అయితే, తాను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని, కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదని చెప్పింది. కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుందని చెప్పింది.