సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (18:21 IST)

కంగనా రనౌత్‌కు సైఫ్ అలీ ఖాన్ సారీ చెప్పేశాడు.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు.. బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఐఫా 2017 వేడుకలో నెపోటిజమ్ పదం చుట్టూ తిరిగిన వివాదం కాఫీ విత్ కరణ్ షో నుంచి ప్రారంభమైంది. బాల

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు.. బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఐఫా 2017 వేడుకలో నెపోటిజమ్ పదం చుట్టూ తిరిగిన వివాదం కాఫీ విత్ కరణ్ షో నుంచి ప్రారంభమైంది. బాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ల‌ను మాత్ర‌మే క‌ర‌ణ్ ప‌రిచ‌యం చేస్తాడ‌ని, ప‌రిశ్ర‌మ‌లో నెపోటిజంకు మారుపేరు క‌ర‌ణ్ అని `కాఫీ విత్ క‌ర‌ణ్‌` షోలో కంగ‌నా వ్యాఖ్యానించారు. 
 
దీనికి ప్ర‌తిగా ఐఫా 2017 వేడుక‌లో ఈ విష‌యం మీద జోకులు పేలుస్తూ కంగ‌నా మాట‌ల‌కు `నెపోటిజ‌మ్ రాక్స్‌` అంటూ సైఫ్‌, క‌ర‌ణ్‌, వ‌రుణ్‌లు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ఐఫా 2017 వేడుక‌లో వ‌రుణ్ ధావ‌న్‌, క‌ర‌ణ్ జొహార్‌, సైఫ్ అలీఖాన్ సంభాష‌ణ‌లో కంగనా రనౌత్ బాధించే వ్యాఖ్యలు చేసివుంటే క్షమించాల్సిందిగా సైఫ్ అన్నారు. ఆమెకు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు సైఫ్ తెలిపాడు. ఈ వివాదంలో ఇప్పటికే వ‌రుణ్ ధావ‌న్‌ కంగనాకు క్షమాపణలు చెప్పేశాడు.. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కూడా సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఇదిలా ఉంటే.. అప్పట్లో వారసత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో కంగనా రనౌత్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐఫాలో కంగనాను ఏకేసిన కరణ్.. ఆపై స్పందిస్తూ.. వారసత్వం వర్ధిల్లదని, టాలెంటే గెలుస్తుందని తన మాటలను వెనక్కు తీసుకున్నారు. వారసత్వంపై ఐఫా అవార్డుల్లో తాను కేవలం జోక్ చేశా. అంతే. జోక్‌గా మాట్లాడిన మాటలనే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నానని కరణ్ జోహర్ వివరణ ఇచ్చుకున్నారు.