శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (10:46 IST)

బాలయ్య 107లో ఊరమాస్ లుక్‌లో దునియా విజయ్

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరెక్కుతుంది. ఇది బాలయ్య 107వ సినిమా. ఈ మూవీకి "వీరసింహా రెడ్డి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్నారు. ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దునియా విజయ్ లుక్‌ను పరిచయం చేస్తూ కొంతసేపటి క్రితం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించుకుంటూ దునియా విజయ్ వదిలిన లుక్ అదుర్స్. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తమన్ సంగీతం.