బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (08:42 IST)

కన్నడ స్టార్ ఉపేంద్ర హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా #యూఐ

Upendra, #UI
Upendra, #UI
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ #యూఐ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్ తో ఆడియన్స్ ని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర.
 
తాజాగా మేకర్స్ #యూఐ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఉపేంద్ర పెద్ద మిషన్ గన్ పట్టుకొని డైనమిక్ గా నిలుచున్న రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
ఈ చిత్రంలో ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: శివ కుమార్ జె (KGF1&2 ఫేమ్), సినిమాటోగ్రఫీ HC వేణుగోపాల్ (A & H2O ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) సూపర్ వైజ్ చేస్తున్నారు.