శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (19:24 IST)

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ కౌశల్... కత్తి మహేష్ సంచలనం

బిగ్ బాస్ తెలుగు 2 చివరి దశకు రావడంతో దీనికి సంబంధించిన కామెంట్లు కూడా జోరందుకున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో కేవలం ఐదుగురే వున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొని వుంది. ఇదిలావుంటే ఎపుడూ సినిమాలు, హీరోలపై వ్యాఖ్యలు చేసే క్రిటిక్ కత్తి మహేష్ తాజా

బిగ్ బాస్ తెలుగు 2 చివరి దశకు రావడంతో దీనికి సంబంధించిన కామెంట్లు కూడా జోరందుకున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో కేవలం ఐదుగురే వున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొని వుంది. ఇదిలావుంటే ఎపుడూ సినిమాలు, హీరోలపై వ్యాఖ్యలు చేసే క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా తన కామెంట్లను బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ పైకి ఎక్కుపెట్టాడు. "కౌశల్ అంతా కోల్పోయాడు. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి" అని కత్తి మహేశ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా బిగ్ బాస్ ఇంట్లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, గీతా మాధురి, సామ్రాట్‌లు మిగిలి వున్నారు. బిగ్ బాస్ షో చరిత్రలో అత్యంత విసుగు తెప్పించే వ్యక్తి కౌశల్ ఒక్కడేనంటూ బాంబు పేల్చాడు కత్తి మహేష్. మరిప్పుడు కత్తి ట్వీట్ పైన కౌశల్ సైన్యం ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.