సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జనవరి 2025 (17:36 IST)

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

keethi suresh
కీర్తి సురేష్ గత కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. వివాహం తర్వాత ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేసిన బేబీ జాన్ కూడా పరాజయం పాలైంది. ఇటీవలి ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్ తాను ఇప్పుడు వివిధ భాషలలో నాలుగు సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నానని, బాలీవుడ్‌లో ఒక థ్రిల్లర్ కూడా ఉందని వెల్లడించారు. 
 
ఈ నాలుగు సినిమాల్లో రెండు తమిళ డార్క్ కామెడీలు, రివాల్వర్ రీటా, కన్నివెడి కాగా, ఒకటి మలయాళంలో యాక్షన్ సినిమాగా రూపొందుతోంది కీర్తి సురేష్. బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బేబీ జాన్ పూర్తిగా డిజాస్టర్ అయింది. బేబీ జాన్‌తో తన బాలీవుడ్ కెరీర్‌ను ముగించాలని కీర్తీ అనుకుంటున్నట్లు సమాచారం. 
 
బేబీ జాన్‌తో పాటు, కోలీవుడ్‌లో రఘు తాతతో సహా ఆమె ఇటీవల విడుదలైన చిత్రాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి. అయితే, కీర్తి సురేష్‌కు కొత్త అవకాశం దొరికినట్లుంది. ఈ పేరు పెట్టని సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి కీర్తి సురేష్ తిరిగి మంచి విజయాన్ని సాధించడానికి సహాయపడుతుందో లేదో చూద్దాం.