శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (14:12 IST)

ఓటీటీలో కీర్తి సురేష్ మూడో సినిమా.. గుడ్ లక్ సఖి..

Good Luck Sakhi
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ నటించిన మరో సినిమా 'గుడ్ లక్ సఖి' ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. గతంలో కీర్తి నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా కూడా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించాయి. కరోనా కారణంగా ఈ సినిమాలు థియేటర్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైయాయి.
 
ఇక ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు.
 
నగేష్ కుకునూర్ గతంలో 'హైదరాబాద్ బ్లూస్', 'తీన్ దీవారే', 'ఇక్బల్' వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 3న విడులయ్యేది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు.