శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 29 మే 2021 (19:14 IST)

సావిత్రి లుక్ కోసం మొద‌టి ఫొటో షూట్ కీర్తి సురేష్‌

Kirti Suresh
ప్ర‌స్తుతం కీర్తి సురేష్ చాలా పాపుల‌ర్, బిజీ వున్న న‌టి. క‌రోనా స‌మ‌యంలో త‌న‌కు వ‌చ్చిన ఆలోచ‌న‌ల‌తో ఫొటో షూట్‌ల‌ను చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్న లుక్ 2018లో `మ‌హాన‌టి` కోసం చేసిన నేత‌చీర క‌ట్టుతో ఇచ్చిన ఫొటో. దీన్ని మ‌ర‌లా క‌ట్టుకుని అప్ప‌టి జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటుంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఆమెను ఓ సినిమా చూసి ఇలాంటి అమ్మాయి బాగుంటుంద‌ని అనుకుని ఆమెను సంప్ర‌దించాడ‌ట‌. ఆమె అప్పుడు నేను లోక్ సినిమా షూటింగ్‌లో వుంది.
 
ఆ స‌మ‌యంలో కీర్తి సురేష్‌ని మేక‌ర్స్ సంసావిప్ర‌దించారట‌. సావిత్రి పాత్ర‌కు తాను న్యాయం చేయ‌గ‌లుగుతానా! అని కీర్తి చాలా ఖంగారు ప‌డింద‌ట‌. అయితే త‌న‌కు లుక్ టెస్ట్ చేయ‌గా, తాజాగా నాడు కట్టుకున్న చీరను, అక్కడ లుక్ టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ త‌న ఇంటిలోనే క‌ట్టుకుని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు . హహ.. అంటూ న‌వ్వుతూ త‌న మొద‌టి టెస్ట్ చేసిన ఈ ఫోటో వెనకాల ఎన్నో తీపిగుర్తులు వున్నాయంటూ సెల‌విచ్చింది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ న‌ట‌న అంద‌రిని మైమ‌ర‌చిపోయేలా చేసింది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. 2018లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హాన‌టి చిత్రం అనేక సాహ‌సాల న‌డుమ రూపొందింది.