బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 29 మే 2021 (12:48 IST)

బింబిసారాలో కొత్త లుక్‌తో క‌ళ్యాణ్‌రామ్‌

Bimbisara
మొద‌టినుంచి విభిన్న‌మైన క‌థాంశాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌. తాజాగా త‌న తాత జ‌యంతి సంద‌ర్భంగా త‌న‌బేన‌ర్‌లో రూపొందుతున్న `బింబిసారా చిత్ర లుక్‌ను, వీడియోను విడుద‌ల చేశారు. కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా, శ‌నివారంనాడు మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నిల‌బ‌డి రండిరా యుద్ధానికి అన్న‌ట్లు సీరియ‌స్‌లుక్‌లో వుంది.
 
ఇది చూడ‌డానికి పాన్ ఇండియా లెవ్‌లో వుంది. టైం ట్రావెల్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు.