ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (09:14 IST)

మోడీని మనిషిగా మారుద్దాం... మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటా : కొరటాల శివ

ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మారుద్దామంటూ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ చేసిన ట్వీట్‌పై నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు మాత్రమే రాజకీయాన్ని అంటగట్టి.. విమర్శలు గుప్పిస్తున్నా

ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మారుద్దామంటూ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ చేసిన ట్వీట్‌పై నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు మాత్రమే రాజకీయాన్ని అంటగట్టి.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు కొరటాల శివ కౌంటర్ ఇచ్చారు. 
 
ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే తాను స్పందించానని, రాజకీయాలు, రాజకీయ పార్టీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనమంతా ఏకతాటిపైకి వచ్చి స్పందిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి విపత్తే వచ్చిందని అన్నాడు. తనలోని బాధను ఎటువంటి ఆలోచనలు, లెక్కలు వేయకుండా వ్యక్తపరిచానని, ఇకపైనా అలాగే చేస్తానని, దయచేసి రాజకీయాలు చేయవద్దని కోరాడు.
 
అంతకుముందు విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మోసాన్ని ఎండగడుతూ "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయతీగా భావిస్తున్నారా సార్?" అంటూ సూటిగా ప్రశ్నించిన విషయం తెల్సిందే.