మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (07:36 IST)

కౌర‌వుల ప‌క్షాన కృష్ణుడు వుండ‌డ‌మే సుల్తాన్ః కార్తీ

Karti, rashimka, etc
హీరో కార్తి న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘సుల్తాన్’‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌2న విడుద‌ల‌వుతున్న తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ ద్వారా వ‌రంగ‌ల్ శ్రీ‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.  ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది.
 
హీరో కార్తి మాట్లాడుతూ, త‌మిళ‌నాడుతో ఎల‌క్ష‌న్స్ కాబ‌ట్టి ఏప్రిల్‌2న రాబోతున్నాం. మా క‌ష్టాన్ని అర్ధం చేసుకుని మా సినిమా కూడా బాగా ఆడాల‌ని విష్ చేసిన మా అన్న‌య్య నాగార్జున గారికి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఒక అన్న‌య్య ఏం చేయాలో అదే చేశారు. నాగ్‌స‌ర్ ఐల‌వ్‌యూ..ఒక త‌మ్ముడుగా మా అన్న‌య్య వైల్డ్‌డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటున్నాను. నాగార్జున‌గారిలా మ‌ళ్లీ మళ్లీ డిఫ‌రెంట్ సినిమాలు తీసుకురావ‌డం చాలా క‌ష్టం. ఆయ‌న ఫ‌స్ట్ నుండి చేస్తున్నారు. నాకు నాగార్జున‌గారు పెద్ద ఇన్స్‌పిరేష‌న్‌. నేను ఊపిరి చేసింది ఆయ‌న్ని క‌ల‌వ‌చ్చు అనే. వంశీగారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌లాంటి వారు. ఆయ‌న ఇక్క‌డికి రావ‌డం హ్యాపీగా ఉంది. ద‌ర్శకుడు బ‌క్కియ‌రాజ్ న‌న్ను క‌లిసి 20నిమిషాలు ఈ ఐడియా గురించి చెప్పారు. ఆ త‌ర్వాత నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి ఈ స్టోరీ చాలా బాగుంది అని దాదాపు రెండు సంవ‌త్స‌రాలు స్క్రిప్ట్ డెవ‌ల‌ప్ చేశారు. 
 
ఇంట్లో ఒక్క అన్న‌య్య ఉంటేనే చాలా గొడ‌వ‌లు వ‌స్తాయి. అలాంటిది ఈ సినిమాలో వంద‌మంది అన్న‌య్య‌లు ఉంటారు ఎన్ని గొడ‌వ‌లు వ‌స్తాయో మీరే ఆలోచించండి. ప్ర‌తి క్యారెక్ట‌ర్ చాలా బాగా వ‌చ్చింది. ఈ కోవిడ్ వ‌ల్ల వ‌చ్చిన స్ట్రెస్‌ ఈ సినిమా చూస్తే పోతుంది. అంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఖైదీ లాంటి సినిమా చూసే వాళ్ల‌కి హై ఆక్టేన్ యాక్ష‌న్ ఉంది. ఊపిరి చూసే వారికి కామెడీ, ఆవారా చూసే వాళ్లకి మంచి ల‌వ్ స్టొరీ, రొమాన్స్‌‌ ఇలా అన్ని ఉన్నాయి. ముఖ్యంగా చివ‌రి 40 నిమిషాల్లో ఎమోష‌న్ చాలా బాగా కుదిరింది. మ‌హాభార‌తంలో కృష్ణుడు పాండ‌వుల‌వైపు కాకుండా కౌర‌వుల‌వైపు ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్‌ని తీసుకుని ఈ క‌థ రాశారు. ర‌ష్మిక చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా బాగా చేసింది. సినిమా చూశాను చాలా న‌చ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. వ‌రంగల్ శ్రీ‌ను కంటిన్యూయ‌స్‌గా స‌క్సెస్ ఇస్తున్న డిస్ట్రిబ్యూట‌ర్ కాబ‌ట్టి ఈ సినిమా కూడా అత‌నికి స‌క్సెస్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఏప్రిల్‌2న మా అన్న‌య్య సినిమా వైల్డ్‌డాగ్ చూసిన త‌ర్వాత మా సినిమా కూడా చూడండి`` అన్నారు. 
 
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ -  ముందుగా నేష‌న‌ల్ అవార్డు సాధించిన సంద‌ర్భంగా ఇక్క‌డి వ‌చ్చిన వంశీపైడిప‌ల్లిగారికి కంగ్రాచ్యులేష‌న్స్‌. కొన్ని ప్రొడ‌క్ష‌న్స్ మాత్ర‌మే త‌మ బ్రాండ్ వ్యాల్యూస్ క‌లిగిఉంటుంది. అందులో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఒక‌టి. ఖాకీ, ఖైది లాంటి సినిమాలే దానికి ఉదాహ‌ర‌ణ‌. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు గారు కాన్సెప్ట్ ఓరియంటెట్ మూవీస్ మాత్ర‌మే నిర్మిస్తారు. ఆన్ స్క్రీన్‌మీద కార్తి చాలా న్యాచుర‌ల్‌గా యాక్ట్ చేస్తారు. మ‌న ప్ర‌క్కింటి అబ్బాయి అనేలా ఉంటారు. ర‌ష్మిక సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. ట్రైల‌ర్ చూస్తే మార్చి లెక్క‌లు అన్ని అయిపోయాయి. ఇక బాక్సాఫీస్ లెక్క‌ల్ని తేలుస్తుంది అనిపించింది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.
 
ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ - ``మీ అంద‌రినీ క‌లిసి చాలా రోజులైంది. తమిళ్ ఇండ‌స్ట్రీలో ఇది నా  డెబ్యూ ఫిలిం. కొంచెం న‌ర్వ‌స్‌గా, అలాగే ఎగ్జ‌యిటింగ్‌గా కూడా ఉంది. షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ వారు చాలా బాగా చూసుకున్నారు. ఏప్రిల్‌2న సినిమా చూసి ఎంజాయ్ చేయ‌డం`` అన్నారు.
 
నిర్మాత కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ- ``డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప్ర‌భు, ప్ర‌కాశ్ గారు చాలా సింపుల్గా ఉంటారు కాని వాళ్ల స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ అద్భుతంగా ఉంటుంది. వారికి అన్ని స‌క్సెస్‌లు వ‌చ్చాయి. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. సూర్య‌గారు, కార్తి మ‌న తెలుగు వాళ్ల‌కి అల్లుడు లాంటి వారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నుకి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ మాట్లాడుతూ - `` నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. చాలా మంది తెలుగు హీరోల‌కి నేను అభిమానిని కూడా..ఇదొక మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త‌ప్ప‌కుండా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ 2న రిలీజ‌వుతున్న సుల్తాన్ సినిమాని అంద‌రూ థియేట‌ర్‌లోనే చూడండి. ఈ అవ‌కాశం ఇచ్చిన కార్తి, ప్ర‌భుగారికి థ్యాంక్స్‌`` అన్నారు.
 
డ్రీమ్ వారియ‌ర్ పిక్ట‌ర్స్ అధినేత ఎస్ ఆర్ ప్ర‌భు మాట్లాడుతూ - ``తెలుగు రాష్ట్రాల్లో ఎమోష‌న్ సెట్ అయ్యింది. ఇప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాలెన్స్ ఉంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్మ‌కం ఉంది. మ‌రో మంచి సినిమా ఇచ్చిన కార్తి గారికి థ్యాంక్స్‌. స‌త్య‌న్ సూర్య‌న్‌తో ఇది నాలుగ‌వ చిత్రం. ఆ స‌క్సెస్ లు కంటిన్యూ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ- ``స‌రిగ్గా ఐదేళ్లు అయింది ఊపిరి సినిమా వ‌చ్చి. అలాగే కార్తి గారి పెయింటింగ్ మీరు చూసి..ఐదేళ్ల త‌ర్వాత ఏప్రిల్‌2న నాగార్జున‌గారు, కార్తి సినిమాలు వ‌స్తున్నాయి. ఇది కో ఇన్స్‌డెంట్‌. నాగార్జున గారు చెప్పారు నా త‌మ్ముడి సినిమా కూడా ఆడాల‌ని.. ఈ రోజు నేను కోరుకుంటున్నాను ఈ రెండు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వాల‌ని. కార్తి గారు ఇంట్ర‌డ్యూస్ అయిన ద‌గ్గ‌ర నుండి అన్ని డిఫ‌రెంట్ సినిమాలే చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు సుల్తాన్ సినిమాలో మాస్ అవ‌తారంలో చూడ‌బోతున్నాం. వంద‌త‌ల‌ల కార్తిగారిని ఏప్రిల్‌2న చూడ‌బోతున్నాం. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.