శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (14:06 IST)

లక్ష్మీస్ వీరగ్రంథం ముహూర్తం ఖరారు.. ఆహ్వానపత్రిక ఇదే..

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను రూపొందిస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతోనే సంచలనం మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి వర్మ ఆకట్టుకున

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను రూపొందిస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతోనే సంచలనం మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి వర్మ ఆకట్టుకున్నాడు. చంద్రబాబు అధికార దాహానికి ఎన్టీఆర్ బలయ్యాడని.. ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకులు అమాయకులు అని లక్ష్మీ పార్వతీ విమర్శిస్తున్న వేళ... వర్మ సినిమాకు కౌంటర్‌గా లక్ష్మీస్ వీరగ్రంథం తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా, మరో అడుగు ముందుకేసి లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. నవంబర్ 12 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్యలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ను ఎన్టీఆర్ సమాధి వద్దే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జయం మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. సినిమా ముహూర్తానికి సంబంధించిన ఆహ్వానపత్రికను ఫేస్‌బుక్ ద్వారా కేతిరెడ్డి విడుదల చేశారు. ముహూర్తపు పూజకు అందరూ ఆహ్వానితులే కేతిరెడ్డి ఆహ్వానించారు.