ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (15:05 IST)

భార్యలు వద్దు పార్టీ ముద్దు: డ్రంకన్ డ్రైవ్‌‌లో పట్టుబడిన వర్ష కపుల్

జబర్దస్త్ న్యూ ఇయర్ ప్రోమో విడుదలైంది. న్యూయర్ కోసం జబర్దస్త్ భార్యలు వద్దు పార్టీ ముద్దు అనే పేరుతో స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది. కాగా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ ప్రసారం చేసింది. 
 
ఈ ప్రోమోలో జబర్దస్త్ జోడీ ఇమాన్యుయేల్ వర్ష డ్రంక్ అండ్ డైవ్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. వీరితో పాటూ ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ కూడా ఉన్నారు.
 
ఈ ప్రోమోలో న్యూయర్ పార్టీ ఎంజాయ్ చేస్తూ వస్తుండగా వీరిని థర్టీ ఇయర్స్ పృధ్వీ పట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ జంట వితికా-వరుణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా ఈ ప్రోమోలో ఆర్జీవి కూడా సందడి చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.