సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (13:48 IST)

సినిమా ఫ్లాపైతే హీరోయిన్‌నే ఎందుకు టార్గెట్ చేస్తారు : లావణ్ త్రిపాఠి

ఒక చిత్రం ఫ్లాపైతే కేవలం హీరోయిన్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారని లావణ్య త్రిపాఠి ప్రశ్నిస్తోంది. ఈ విషయంలోని లాజిక్కు ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చింది. 
 
తెలుగు వెండితెరకు అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత పలువురు కుర్ర హీరోలతో పాటు.. సీనియర్ హీరో నాగార్జుతతో కూడా కలిసి నటించింది. అలాగే, భలే భలే మగాడివోయ్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. 
 
పేరుకు మాత్రం ఉత్తరాది అమ్మాయే అయినా అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. అందుకే ఈమె తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగింది. కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతుంది. తాజాగా ఈ భామకు జయాపజయాలను ఎలా స్వీకరిస్తారనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
సాధారణంగా ఒక చిత్రం సక్సెస్ అయితే, ఆ సక్సెస్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అదే పరాజయం పాలైతే మాత్రం కేవలం హీరోయిన్‌కు మాత్రమే అంటగడుతారు. ఇదెక్కడి న్యాయం. లాజిక్కో అర్థంకాదు. హీరోయిన్‌నే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. మిగతావారిని అడగరు. ఇప్పటికీ నాకు అర్ధంకాని విషయం అదే అంటూ సెలవిచ్చింది ఈ అందాల రాక్షసి.