సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (21:48 IST)

చిరంజీవి ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.40లక్షలు సాయం చేశారు.. ఎవరు? (video)

Ponnambalam
మెగాస్టార్ చిరంజీవిపై విలన్‌గా చేసిన తమిళ నటుడు పొన్నాంబళం ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తన బ్రదర్ డ్రింక్ పాయిజన్ కలపడం వల్ల ఓ కిడ్నీ కోల్పోయిన ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆదుకున్నాడని తెలిపాడు.  
 


తన ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక చిరంజీవిని అడిగితే... లక్షో రెండు లక్షల సాయం చేస్తారనుకుంటే.. తానున్నానని చెప్పి ఐదు నిమిషాల్లో దగ్గరలో వున్న అపోలోకి వెళ్లి అడ్మిట్ అవ్వమన్నారు. అక్కడ తనను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదని.. మొత్తం రూ.40లక్షలు అయ్యింది.. అది ఆయనే చూసుకున్నారని పొన్నాంబళం తెలిపాడు.