శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (23:09 IST)

చింతగింజల నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? (video)

చింతపండు గింజలు. ఈ గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్త ఉత్పత్తిని పెంచడానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. ఇంకా చింతగింజలు కలుగజేసే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. చింతపండు గింజల పొడిని చిగుళ్ళు, దంతాల మీద రుద్దడం వల్ల ప్రయోజనకరంగా వుంటుంది. చింతగింజల రసంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను మరింత తగ్గిస్తుంది.
 
చింతపండు గింజలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పేగు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి చింతగింజలు కాపాడుతాయి. చింతపండు గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతాయి.
 
చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించవచ్చు.
చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటు- హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది.