శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (17:29 IST)

"ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి" ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పైన మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణలో రూపొందిన చిత్రం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి". జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఆసక్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న ల‌భిస్తుంది.
 
కార్తిక్, సంచిత హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌లో వీరి ఫోజ్ రోటీన్ లుక్స్‌కి భిన్నంగా ఉంటూ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. ఒక రిలేష‌న్‌కి క‌మిట్ అయ్యేందుకు క‌న్‌ఫ్యూజ్ అయ్యే జంటకు వారి మ‌ధ్య ప్రేమే స‌మ‌స్య‌గా ఎలా మారుతుంది అనేది ఆస‌క్తిగా తెర‌మీద‌కు క‌నువిందు చేయ‌బోతుంది.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ, ఈ జ‌న‌రేష‌న్ ఏ రిలేష‌న్ క‌యినా క‌మిట్ అవ‌డానికి భ‌య‌ప‌డ‌తారు. క‌న్ఫ్యూజ్ అవుతారు.. క‌రెక్టా కాదా అనే సందేహాల‌లో ప‌డిపోతారు. వారి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ‌లు, ప్రేమ‌లు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేష‌న్‌తో ముడి పెడ‌తానికి ఇష్ట‌ప‌డ‌రు. అదే మా ప్రేమ క‌థ.
 
మోడ్ర‌న్ క‌ల్చ‌ర్లో నేటి జ‌న‌రేష‌న్ లివింగ్ స్టెయిల్‌ని ప్ర‌తిబింబించే ఈ క‌థ త‌ప్ప‌కుండా యూత్‌కి క‌నెక్ట్ అవుతుంద‌నే నమ్మ‌కం మాకు ఉంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. థియేట‌ర్స్‌కి అనుమ‌తులు ల‌భించ‌గానే రిలీజ్‌కి ప్లాన్ చేసుకుంటాం అన్నారు.
 
కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ‌ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్, క‌ళా జ్యోతి, అనురాధ మ‌ల్లికార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వెంక‌ట సిద్దారెడ్డి, స‌మ‌ర్స‌ణ: మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి; నిర్మాత‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ గాలి.