సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (22:08 IST)

మంత్రి తలసానితో ‘మా’ నూతన కార్యవర్గం భేటీ.!

నూతనంగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, జాయింట్ సెక్రెటరీ శివబాలాజీ, ఈసీ మెంబర్ సురేష్ కొండేటితో పాటు మరికొంత మంది సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ‘మా’ కార్యవర్గానికి మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ నూతన అధ్యక్షుడు వీకే నరేష్.. మంత్రి తలసానితో దాదాపు ముప్పావు గంటపాటు చర్చించారు.
 
‘మా’లో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ‘మా’ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయాన్ని కూడా మంత్రి దృష్టికి నరేష్ తీసుకొచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను ఖ‌చ్చితంగా పరిష్కరిస్తామని, సినీ రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. స్థలం కేటాయింపు విషయాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.