మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (16:50 IST)

''రంగస్థలం''ను వెనక్కి నెట్టిన మహానటి

మహానటి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిపోయింది. అలనాటి తార సావిత్రి బయోపిక్ తెరకెక్కింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ మహానటి పాత్రలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.


ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలను ఈ సినిమా దక్కించుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. తాజాగా మహానటి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 
 
2018 సంవత్సరం భారత్‌లో విడుదలైన టాప్-10 చిత్రాల్లో మహానటి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సినిమా తర్వాత టాప్-10లో మరో తెలుగు సినిమా ''రంగస్థలం'' ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

రంగస్థలంలో చెర్రీ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో రూ.200కోట్ల క్లబ్‌కు చేరిన సినిమాల్లో రంగస్థలం కూడా ఒకటి.