సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (15:48 IST)

రజత్ రాఘవ్ హీరోగా మహర్ యోధ్ 1818 సినిమా ప్రారంభం

Rajat Raghav, Aishwarya Raj Bakuni
Rajat Raghav, Aishwarya Raj Bakuni
సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. *తొలి ప్రయత్నమే  డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్  "మహర్ యోధ్  1818"  సినిమా ప్రారంభం చేశారు. 
 
మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన  యువ ఛార్మింగ్ హీరో  రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య రాజ్  బకుని హీరోయిన్ గా.. రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ  రాజు దాసరి నిర్మిస్తున్న  సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ చిత్రం "మహర్ యోధ్  1818". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో  హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో షూటింగ్  ఘనంగా ప్రారంభమైంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏ.పి.   యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్  కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  అగ్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు  గౌరవ దర్శకత్వం వహించారు.