1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (21:28 IST)

ప్రిన్స్ మహేష్ బాబును సోకిన కరోనా మహమ్మారి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా మహమ్మారి సోకింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా మహమ్మారి వదలట్లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం మహేష్ బాబు కూడా చేరిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో మహేష్ బాబు వున్నారు.

ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లొచ్చిన ప్రిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.