సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (20:38 IST)

MeToo ఉద్యమం ఓ పనికిమాలింది... మోహన్ లాల్ సంచలనం

MeToo ఉద్యమం గురించి వేరే చెప్పకర్లేదు. సినీ ఇండస్ట్రీల్లో కొందరు హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ పెద్దఎత్తున ఈ ఉద్యమం జరుగుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. హీరోయిన్లలో కొందరు మీటూ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని తమ కసి తీర్చుకుంటున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. 
 
 
ఇకపోతే మలయాళ ఇండస్ట్రీలో అగ్ర నటుడు మోహన్ లాల్ ఈ ఉద్యమంపై సంచలన కామెంట్లు చేశారు. మలయాళ ఇండస్ట్రీలో అసలు లైంగిక వేధింపులు అనేవి లేవని వ్యాఖ్యానించారు.
 
మీటూ ఉద్యమం అనేది ఓ పనికిమాలిన ఉద్యమం అని అన్నారు. లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాలలో వున్నాయనీ, అలాంటి సమస్యలకు గురైనవారు వెంటనే స్పందించి పోలీసుల దృష్టికి తీసుకెళితే సమస్య వుండదన్నారు. మీటూ ఉద్యమం అంటూ ఓ వెర్రిలా కొందరు చేస్తున్నారనీ, అదంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోతుంది చూస్తుండండి అంటూ వ్యాఖ్యానించారు మోహన్ లాల్.