గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2024 (19:07 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు లక్ష్మి ప్రసన్న షాకింగ్ కామెంట్స్

manchu lakshmi prasanna
క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు లక్ష్మి ప్రసన్న షాకింగ్ కామెంట్లు చేసింది. కెరీర్ ప్రారంభంలో తనను కూడా కొందరు ఇబ్బంది పెట్టారని... అలాంటి వారితో తాను దురుసుగా ప్రవర్తించేదాన్నని... ఇదే కారణంతో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నానని చెప్పారు. ఈ సమాజంలో మహిళలకు సరైన స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో ఏముందో తనకు పూర్తిగా తెలియదని వెల్లడించారు. 
 
నిజానికి మంచుఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్లింట్లో ఆడవారిని టచ్ చేసేంత ధైర్యం ఎవ్వరికి లేదు. కాని మంచులక్ష్మీ ని కూడా టచ్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో  ఏ రేంజ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందో అంటున్నారు నెటిజన్లు.