'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)
అనిల్ రావిపూడి దర్శకత్వలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు' సినిమా నుంచి పూర్తి లిరికల్ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందులోని చిరంజీవి స్టైలిష్ లుక్, ఆయన గ్రేస్, సింగర్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌కు ఫిదా అయిన వారంతా పూర్తి పాట ఎపుడొస్తుందా అని ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్ ఇచ్చింది. భాస్కరపట్ల రాసిన ఈ పాటకు భీమ్స్ సంగీతం సమకూర్చారు. ఉదిత్ నారాయణ్‌తో కలిసి శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ చిత్రం వచ్చేయేడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. మెగాస్టారు కుమార్తె సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.