సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (16:27 IST)

చౌర్య పాఠం నుంచి ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ పై మెస్మరైజింగ్ సాంగ్

Indra Ram,  Payal Radhakrishna
Indra Ram, Payal Radhakrishna
దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా 'చౌర్య పాఠం' తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన  సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
తాజాగా ‘చౌర్య పాఠం' ఫస్ట్ సింగిల్ తెలిసి తెలిసి పాటని విడుదల చేసి మ్యూజికల్ జర్నీని ప్రారభించారు మేకర్స్. డేవ్ జాంద్ ఈ పాటని సోల్ ఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని మనసుని హత్తుకునే లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, హరిచరణ్ తమ అద్భుతమైన వోకల్స్ తో ఆకట్టుకున్నారు.
 
ఈ పాటలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ మెస్మరైజింగ్ గా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలించేలా వున్న ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.  
 
స్టార్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించడంతో పాటు డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ కాగ, ఉత్తర ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.