శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (22:44 IST)

విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా.. సినిమాలకు బ్రేక్: నిత్యామీనన్

nitya menon
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్‌ తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నిత్యా ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్‌ తీసుకుంటున్నా నంటూ తెలిపారు.
 
అయితే ఇది తాత్కాలికమే అని స్పష్టం చేశారు. ఏడాదిగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ బ్రేక్‌ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఇటీవల తన పెళ్లిపై వచ్చిన పుకార్లను కూడా ఖండించారు. ప్రముఖ మలయాళ స్టార్‌ యాక్టర్‌తో తన పెళ్లంటూ ఇటీవల రూమర్లు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.