బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (11:39 IST)

సినీ నటిపై లైంగిక వేధింపులు.. బిల్డర్‌పై కేసు నమోదు

crime scene
సినీ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఓ బిల్డర్‌పై కేసు నమోదు చేశారు.తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉన్న బిల్డర్ కె ప్రవీణ్ తన నుంచి రూ.47లక్షలు, తన ద్వారా మరొకరి నుంచి రూ.47 లక్షలు అప్పుగా తీసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
 
"అతను ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు.. బదులుగా అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించడం ప్రారంభించాడు లైంగిక ప్రయోజనాలను కోరుతూ డిమాండ్ చేశాడు" అని ఆమె చెప్పింది. పంజాగుట్ట పోలీసులు ఐపీసీ సెక్షన్ 354ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు