సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (12:29 IST)

కొత్త గెటప్‌లో నయనతార.. అమ్మవారిగా కొత్త లుక్ అదుర్స్

Nayanatara
లేడీస్ సూపర్ స్టార్ నయనతార కొత్త గెటప్‌లో అదరగొట్టేస్తోంది. హీరోయిన్‌గానూ, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అదరగొట్టేస్తున్న నయనతార త్వరలో అమ్మవారి పాత్రలో కనిపించనుంది. శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మ పాత్రలో నటించి మెప్పించిన నయనతార త్వరలో అమ్మవారి పాత్రలో కనిపించనుంది. తమిళ సినిమా ''మూకుత్తి అమ్మన్''లో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతోంది. 
 
ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నయనతార లుక్‌ శనివారం విడుదలైంది. అమ్మవారి పాత్రలో నయన్ లుక్ అందరనీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం నయనతార వెజిటేరియన్‌గా మారిందట. అమ్మవారి పాత్ర కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని షూటింగ్ పూర్తయ్యేవరకు అదే నియమాన్ని పాటిస్తోందట.