సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (14:47 IST)

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Gopichand, Sankalp Reddy, Srinivasa Chitturi and others
Gopichand, Sankalp Reddy, Srinivasa Chitturi and others
కథానాయకుడు గోపీచంద్ తో IB 71 (స్కై బ్యాక్ డ్రాప్), ఘాజీ (వాటర్ బ్యాక్ డ్రాప్) అంతరిక్షం (స్పెస్ బ్యాక్ ట్రాప్) చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు సరికొత్త టెరిటరీలోకి అడుగుపెడుతున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్ కి కోర్ టీం, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
 
భారతీయ చరిత్రలో కీలకమైన, మరచిపోయిన సంఘటన విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయనున్నారు. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా, ఒక ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తోంది. భారతీయ వారసత్వ మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుంది.
 
ఈ చిత్రానికి HIT 1, HIT 2, గీత గోవిందం, సైంధవ్ చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభావంతులైన కోర్ టీమ్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందుతోంది. నటీనటులు, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.