నేను సింగిల్.. నాపై ఒత్తిడి పెరుగుతోంది.. మృణాల్ ఠాకూర్
"సీతారామం"లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాను ఒంటరిగా ఉన్నానని ప్రకటించింది. మరోవైపు తన కుటుంబం తనపై ఒత్తిడి తెస్తోందని మృణాల్ పేర్కొంది. ఆమెకు సరైన భాగస్వామిని కనుగొనమని వారు ఒత్తిడి తెస్తుందన్నారు.
కానీ ఆమె తన నటనా జీవితంపై దృష్టి పెట్టడం వల్ల భాగస్వామిని వెతకడానికి ఆసక్తి చూపడం లేదు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నానితో కలిసి "హాయ్ నాన్న" విజయ్ దేవరకొండతో కలిసి "ఫ్యామిలీ స్టార్" చిత్రాల్లో నటిస్తున్నారు.