గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (12:40 IST)

మా తల్లిదండ్రులకు అది ఇష్టం లేదు.. సీతారామం హీరోయిన్

mrunal thakur
ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తూ ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు. మరోవైపు మొదటి సినిమాతోనే కొంతమంది హీరోయిన్లకు స్టార్ డమ్ వస్తుంది. అలాంటి హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. 
 
సీతారామం నటి మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మృణాల్ తన సినీ కెరీర్, తన కుటుంబ మద్దతు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ "మాది మరాఠీ కుటుంబం. నేను నటన వైపు రావడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఎందుకంటే మా కుటుంబంలో సినిమాకి సంబంధించిన వారు ఎవరూ లేరు. అయినా నేను నా కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. 
 
ఎందుకంటే మొదట్లో నాకు వారి మద్దతు లేదు, ఎందుకంటే వారు ఏమి జరుగుతుందో అని భయపడ్డారు. నాకు మంచి పాత్రలు వస్తాయో లేదో అనే విషయంలో నా తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ప్రస్తుతం ఆ బాధ లేదు.  చాలా మంది నన్ను స్మితా పాటిల్‌తో పోలుస్తున్నారు. 
 
దీని గురించి నేను నిజంగా గర్విస్తున్నాను. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా గురించి చాలా సంతోషంగా ఉన్నారు" అని మృణాల్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేసింది.