1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (12:42 IST)

వడదెబ్బకు విద్యార్థి మృతి - రూ.110 కోట్ల పరిహారం

ఒక విశ్వవిద్యాలయానికి చెందిన కోచ్‌లు శిక్షణ సమయంలో అత్యంత కఠినంగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మండిపోయే ఎండలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో ఒక విద్యార్థి చనిపోయిన విషాదకర ఘటన జరిగింది. కోచ్‌ల నిర్లక్ష్యం వల్ల మృతుని కుటుంబానికి ఏకంగా రూ.110 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తమ కుమారుడి మృతికి యూనివర్శిటీ యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించింది. దీంతో సదరు యూనివర్శిటీ రూ.14 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన యూనివర్శిటీలోని కోచ్‌లు కోచింగ్ నిర్వహించారు. అందులో బ్రేస్ అనే 20 యేళ్ళ విద్యార్థి పాల్గొనగా, ఈ కోచింగ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. దాహార్తిని తీర్చుకునేందుకు కోచ్‌లను అభ్యర్థించారు. 
 
ఇందుకు వారు అంగీకరించలేదు. ఈ వడదెబ్బకు ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించడంతో యూనివర్శిటీ అధికారులు అందుకు సమ్మతించారు.