సంబంధిత వార్తలు
- నేను ప్రేమ వివాహాన్ని నమ్ముతా - రుక్సార్ ధిల్లాన్
- ప్రత్యేక హోదా ఇస్తామంటే ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం : పేర్ని నాని
- నాని కెరీర్లో హయ్యెస్ట్ రికార్డ్ వ్యూస్ సాధించిన అంటే..సుందరానికీ టీజర్
- నజ్రియా ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, నేను ట్రై చేసా...: నేచురల్ స్టార్ నాని కామెంట్స్
- పాన్ ఇండియా సినిమా అంటే అర్థం తెలీదు- నాని
నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ముత్తయ్య టీజర్ విడుదల
Muttiah photo
టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి మాట్లాడుతూ...మా సినిమా టీజర్ ను నాని విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ముత్తయ్య ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే సినిమా అవుతుంది. అన్నారు.
నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ...మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు నానికి థాంక్స్. జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒక్కరూ ముత్తయ్యలో కనిపిస్తారు. అలాంటి వారి భావోద్వేగాలను దర్శకుడు భాస్కర్ మౌర్య ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మా సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. ప్రెజెంటర్స్ హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కృతజ్ఞతలు. అన్నారు.
దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ...తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే ఎంతోమంది వ్యక్తుల ఆరాటానికి ప్రతిబింబం ఈ సినిమా. అలాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథ రాసుకున్నాను. నా కథను అందంగా తెరకెక్కించేందుకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.
టి సాయి లీల, జయవర్థన్ సాగర్, కిరణ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - దివాకర్ మణి, సంగీతం - కార్తీక్ రోడ్రిగ్వజ్, ఎడిటర్ - సాయి మురళి, సహ నిర్మాత - దివాకర్ మణి, నిర్మాత - వ్రిందా ప్రసాద్, సమర్పణ - కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి, పీఆర్వో - జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం - భాస్కర్ మౌర్య.
తర్వాతి కథనం
