శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:26 IST)

నా నుదిటి మీద ఏమి రాసివుందో నాకేమి తెలుసు? సోను సూద్

కరోనా కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపద్బాంధవుడుగా కనిపించిన నిజమైన హీరో సోను సూద్. కరోనా కాలంలో చితికిపోయిన బతుకులకు ఆసరా అందిస్తూ వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సాయం కేవలం స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో వున్నవారికి కూడా ఆయన సాయం చేశారు. 
 
అయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇలా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలేచనేదీ లేదని అన్నారు. 'ఒక యాక్టర్‌గా నా చేతిలో చాలా పనులున్నాయి. దీనికితోడు నేను ఎన్నో చారిటీ పనులు చేస్తున్నాను. వీటిపైనే దృష్టి పెట్టేందుకు సమయం సరిపోతోంది. అందుకే ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించేందుకు చోటులేదు. 
 
పైగా రాజకీయాల గురించి నాకు ఏమాత్రం తెలియదు. అయితే పదేళ్ల తరువాత నేను ఏం చేస్తానో, నా నుదిటి మీద ఏమి రాసి ఉందో నాకేమి తెలుసు? నేను చాలా ముందుకు వెళ్లాల్సివుంది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ పార్టీవారినో అడిగి చేయడం లేదు. నా ఇష్టాపూర్వకంగానే చేస్తున్నానని' అంటూ సోనుసూద్ చెప్పుకొచ్చారు.