ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (10:40 IST)

వర్మ-నాగార్జున సినిమాలో.. ఫస్ట్ లుక్ స్టిల్స్ అదిరాయి..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాలో నాగార్జున లుక్‌ను విడుదల చేశారు. ఇందులో యాంగ్రీమెన్‌గా న

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాలో నాగార్జున లుక్‌ను విడుదల చేశారు. ఇందులో యాంగ్రీమెన్‌గా నాగ్ గన్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా నాగ్ అభిమానులతో పంచుకున్నారు. గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న నాగ్ లుక్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.
 
28ఏళ్ల క్రితం వర్మ-నాగ్ కాంబోలో తెరకెక్కిన శివ మన్మథుడి కెరీర్‌లో మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. "28 సంవత్సరాల క్రితం 'శివ' అనే సినిమా నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో చిత్రం. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతోంది. జీవితంలో నిత్యమూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. కాగా త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని తెలుస్తోంది.